చిప్పగిరి, 2026-11-27
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరివేముల రంగస్వామి 322 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరివేముల రంగస్వామి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నగరడోణ లక్ష్మిరెడ్డిపై 322 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
నేమకల్లు, సంఘాల గ్రామాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో వైఎస్సార్సీపీ అభ్యర్థి కరివేముల రంగస్వామికి 1,511 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి నగరడోణ లక్ష్మిరెడ్డికి 1,189 ఓట్లు లభించాయి. దీంతో రంగస్వామి 322 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని కైవసం చేసుకున్నారు.
బెల్డోణ గ్రామానికి చెందిన కరివేముల రంగస్వామి సాధించిన ఈ విజయంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా విజయం అనంతరం రంగస్వామి మాట్లాడుతూ.. ఈ గెలుపు తనది మాత్రమే కాదని, రెండు గ్రామాల ప్రజలు తనపై నమ్మకంతో ఇచ్చిన తీర్పు అని పేర్కొన్నారు. తనకు అండగా నిలిచి, ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.






