కర్నూలు, 2026-11-26
కర్నూలు జిల్లా ఆదోని తాలూకా పరిధిలోని సలకలకొండ గ్రామంలో గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రామంలో మొత్తం 915 ఓట్లు ఉండగా, 810 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 105 ఓట్లు పోలవలేదు.
గమ్యం న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోని తాలూకా పరిధిలోని సలకలకొండ గ్రామంలో గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రామంలో మొత్తం 915 ఓట్లు ఉండగా, 810 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 105 ఓట్లు పోలవలేదు.
గ్రామంలోని మొత్తం ఎనిమిది వార్డుల్లో ఓటింగ్ నిర్వహించగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు సమాచారం.
వార్డుల వారీగా పోలైన ఓట్ల వివరాలు
1. మొదటి వార్డు 101 ఓట్లు 2. రెండో వార్డు 100 ఓట్లు 3. మూడో వార్డు 96 ఓట్లు 4. నాలుగో వార్డు 102 ఓట్లు 5. ఐదో వార్డు 106 ఓట్లు 6. ఆరో వార్డు 107 ఓట్లు 7. ఏడో వార్డు 102 ఓట్లు 8. ఎనిమిదో వార్డు 96 ఓట్లు
మొత్తం పోలైన ఓట్లు: 810.
కాగా, సర్పంచ్ ఎన్నికల్లో కూటమి పార్టీ తరఫున రమేష్ భార్య లీలావతి, వైఎస్సార్సీపీ తరఫున మల్లేష్ భార్య లక్ష్మి పోటీలో నిలిచారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇరు వర్గాలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించగా, ప్రస్తుతం పోలింగ్ పూర్తవడంతో అభ్యర్థుల గెలుపోటములపై గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు, గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


