అరికట్టేందుకు (గమ్యం ప్రజాస్వామ్యం వైపు) నవంబర్ 12
బళ్లారి జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని జిల్లా పోలీసులు నూతనంగా నార్క్ రిపోర్టర్ ( ) అనే వెబ్సైట్ స్కానర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా ప్రజలు రహస్యంగా సమాచారం అందించేందుకు వీలు కల్పించారు.
బళ్లారి జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా జిల్లా పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన్ డి. పన్నేకర్ నూతనంగా రూపొందించిన నార్క్ రిపోర్టర్ ( ) వెబ్సైట్ స్కానర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు, అక్రమ నిల్వలు, మాదకద్రవ్యాల రవాణా లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే ప్రజలు ఈ వెబ్సైట్ ద్వారా పోలీసులకు సమాచారం అందించవచ్చని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీసి వెబ్సైట్లో నేరుగా అప్లోడ్ చేసే సదుపాయం కల్పించామని వివరించారు.
ప్రజలు సమాచారం అందించిన వెంటనే పోలీసు బృందం అప్రమత్తమై, అందిన సమాచారాన్ని పరిశీలించి సంబంధిత ప్రాంతానికి వెళ్లి తగిన చర్యలు తీసుకునేలా ఈ వ్యవస్థను రూపొందించినట్లు వివరించారు.
సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యం
ఈ వెబ్సైట్ ప్రత్యేకత ఏమిటంటే, సమాచారం అందించిన వ్యక్తి పేరు, ఫోన్ నంబర్, ఇతర వ్యక్తిగత వివరాలు బయటకు వెల్లడికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరు సమాచారం ఇచ్చారనే విషయం ఇతరులకు తెలియకుండా, సమాచారదారుల గుర్తింపును రహస్యంగా ఉంచే విధంగా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.
ఈ వెబ్సైట్ కన్నడ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. వెబ్సైట్ లింక్: ://--..
గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ డాక్టర్ సుమన్ డి ఫన్నీకర్, డీఎస్పీ, సీఐలు పాల్గొని, మాదకద్రవ్యాల పోస్టర్‌తో పాటు స్కానర్‌ను విడుదల చేశారు.
అందిన ప్రతి సమాచారాన్ని రహస్యంగా పరిశీలించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు లేదా బళ్లారి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 9480803000కు ఫోన్ చేయాలని సూచించారు.
మాదకద్రవ్యాల నిర్మూలన పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన్ డి. పన్నేకర్ పిలుపునిచ్చారు.






