పోతాయని (గమ్యం ప్రజాస్వామ్యం వైపు) నవంబర్ 13
తుంగభద్ర జలాశయం నుంచి హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువలకు పంటలు చేతికి వచ్చే వరకు నీటిని విడుదల చేయాలని ఏఐకేకేఎంఎస్ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నెల 20న నీటి సరఫరా నిలిపివేస్తే, అప్పులు చేసి సాగు చేసిన రైతుల పంటలు చేతికి అందకుండా జిల్లా అధ్యక్షుడు గోవింద ఆవేదన వ్యక్తం చేశారు. జలాశయంలో 96 టీఎంసీలకు పైగా నీరు ఉన్నప్పటికీ, రైతులకు నీరు అందించకపోవడం అన్యాయమని విమర్శించారు.
గురువారం గాంధీ భవన్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు రైతులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గురళ్లి రాజా మాట్లాడుతూ, పరిశ్రమలు మోటార్ల ద్వారా జలాశయం నుంచి అక్రమంగా నీటిని తోడుకుంటున్నాయని, ప్రభుత్వం పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ రైతులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పంటలు కోతకు వచ్చే వరకు నీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో ఈ నెల 20 తర్వాత తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు హనుమంతప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు బసన్న, బళ్లారి తాలూకా కార్యదర్శి ధనరాజ్, కురుగోడు తాలూకా అధ్యక్షుడు కొలూరు పంపపాటి, ఉపాధ్యక్షుడు కల్లుకాంబ పంపపాటి, రైతులు శివప్ప, హొన్నూరప్ప, లింగప్ప, హేమంత్ రాజ్, వీరేష్ గౌడ్, సిద్దరోడ, హులుగప్ప, టి. మల్లికార్జున, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

