సత్యసాయి కాలనీ ఫస్ట్ క్రాస్, బళ్లారి (గమ్యం ప్రజాస్వామ్యం వైపు) నవంబర్ 08
బళ్లారి నగరంలోని సత్యసాయి కాలనీలో గమ్యం పత్రిక ఎడిటర్ జి. గిరి యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
బళ్లారి నగరంలోని 20వ వార్డు సత్యసాయి కాలనీ ఫస్ట్ క్రాస్‌లో గమ్యం పత్రిక ఎడిటర్ జి. గిరి యాదవ్ నివాసంలో దీపావళి పండుగను కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సతీమణి అన్నపూర్ణ, కుమార్తె భూమిక, కుమారుడు హేమంత్ రెడ్డి, అన్నపూర్ణ అక్క కుమార్తె చార్వి తదితరులు కుటుంబ సమేతంగా లక్ష్మీ పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటి ముందు దీపాలు వెలిగించి, బాణసంచా కాలుస్తూ దీపావళి పండుగను సంతోషంగా ఆచరించారు.







