కృత్రిమ మేధ () ఆధారిత సైబర్ దాడులు భారతదేశంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (లు), డిజిటల్ రుణ సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలు, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలపై పెరుగుతున్నాయని భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (-) హెచ్చరించింది. క్రాఫ్టీ ఫాల్కన్‌గా గుర్తించిన ఈ సైబర్ ముప్పు ప్రస్తుతం కొనసాగుతోందని తెలిపింది.
దాడి చేసేవారు అందుబాటులో ఉన్న ఆధారిత టూల్స్‌ను ఉపయోగించి లక్ష్య సంస్థల వ్యవస్థలను పరిశీలిస్తున్నారు. వాటిలోని భద్రతా లోపాలను గుర్తించి, సంస్థల సొంత పేమెంట్, డబ్బుల పంపిణీ వ్యవస్థలను ఉపయోగించి అనధికార లావాదేవీలకు ప్రయత్నిస్తున్నారు.
ఈ దాడుల్లో , , , అనే నాలుగు టూల్స్‌ను ఉపయోగిస్తున్నట్లు - గుర్తించింది. వీటి సాయంతో దాడి స్క్రిప్ట్‌లను వేగంగా రూపొందించడం, లక్ష్య వ్యవస్థ స్పందనకు అనుగుణంగా వాటిని మార్చడం సాధ్యమవుతోందని తెలిపింది.
సాధారణంగా వారాంతాలు, పండుగ సెలవులు, భద్రతా సిబ్బంది పర్యవేక్షణ తక్కువగా ఉండే సమయాల్లో దాడులకు పాల్పడుతున్నట్లు - గుర్తించింది. గతంలో భద్రతా లోపాలను సరిచేసిన కొన్ని సంస్థలపై కూడా పూర్తిస్థాయి పరిష్కారాలు అమలు కాకపోవడంతో మళ్లీ దాడులు జరిగినట్లు వెల్లడించింది.
ఇంటర్నెట్కు అనుసంధానమైన సర్వర్లు, క్లౌడ్ వ్యవస్థలు, పరీక్షల కోసం ఉపయోగించే సాఫ్ట్వేర్ వాతావరణాలు, పేమెంట్ లలోని లోపాలను దాడి చేసేవారు ఉపయోగించుకుంటున్నట్లు అడ్వైజరీ పేర్కొంది. కొన్ని సందర్భాల్లో చిన్న మొత్తాల లావాదేవీలతో పరీక్షించి, ఆ తర్వాత పెద్ద మొత్తాలను బదిలీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
చైనా సంబంధాలపై అనుమానాలు
ఈ దాడుల్లో ఉపయోగిస్తున్న కొన్ని టూల్స్‌కు చైనా సంబంధాలు ఉన్నాయని సైబర్ భద్రతా పరిశోధకులు గతంలో పేర్కొన్నారు. అయితే ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారు, ఏ సంస్థలు ప్రభావితమయ్యాయి, ఎంత మొత్తం నష్టం జరిగింది అనే వివరాలను - బహిరంగంగా వెల్లడించలేదు. ఈ దాడులకు ఏదైనా దేశ ప్రభుత్వ ప్రమేయం ఉందని కూడా అధికారికంగా నిర్ధారించలేదు.
ఆర్థిక సంస్థలకు కీలక సూచనలు
ఆర్థిక సంస్థలు తమ సర్వర్లను నిరంతరం పర్యవేక్షించాలని, పేమెంట్ వ్యవస్థలకు అదనపు భద్రత కల్పించాలని - సూచించింది. అనుమానాస్పద లావాదేవీలను వెంటనే గుర్తించి, ప్రభావిత వ్యవస్థలను వేరుచేసి, సంబంధిత ఆధారాలను భద్రపరచాలని తెలిపింది.
సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మరింత వేగంగా దాడులు చేయగలుగుతున్న నేపథ్యంలో ఆర్థిక సంస్థలు తమ సైబర్ భద్రతను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ హెచ్చరిక స్పష్టం చేస్తోంది.
భారతదేశంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (లు), డిజిటల్ రుణ సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలు, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలపై కృత్రిమ మేధ () ఆధారిత సైబర్ దాడులు పెరుగుతున్నాయని భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (-) హెచ్చరించింది. క్రాఫ్టీ ఫాల్కన్‌గా గుర్తించిన ఈ సైబర్ ముప్పు ప్రస్తుతం కొనసాగుతోందని తెలిపింది.






