అనంతపురం జిల్లా నియోజకవర్గంలోని ఈస్ట్ కోడిపల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండాపురం సింధుశ్రీ అనిల్ చౌదరి ఘన విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుగాలి లక్ష్మీదేవి గోపాల్ నాయక్‌పై 1,153 ఓట్ల భారీ మెజార్టీతో ఆమె గెలుపొందారు.
ఈస్ట్ కోడిపల్లి పంచాయతీ పరిధిలో మొత్తం 4,350 ఓట్లు ఉండగా, 3,343 ఓట్లు పోలయ్యాయి. సింధుశ్రీ అనిల్ చౌదరికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించి, భారీ మెజార్టీతో గెలుపొందారు.
ప్రజల మద్దతు
గతంలో మాజీ సర్పంచ్‌గా, సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా, విద్యార్థి నాయకుడిగా, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడిగా అనిల్ చౌదరి అందించిన సేవలను గుర్తించిన ప్రజలు, ఆయనకు విజయాన్ని అందించారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఈస్ట్ కోడిపల్లి పంచాయతీ పరిధిలోని కోడిపల్లి, వర్లి, లక్ష్మీపురం, కాపర్లపల్లి, పీటీఆర్ పల్లి గ్రామాల ప్రజలు తనపై నమ్మకంతో ఆశీర్వదించి గెలిపించినందుకు, సింధుశ్రీ అనిల్ చౌదరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
విజేత సంబరాలు
విజయం అనంతరం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ప్రధాన రహదారిపై కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.












